Site icon HashtagU Telugu

Chandrayaan-3: చంద్రుడిని హిందూ రాష్ట్రంగా మార్చేస్తారా??

Chandrayaan-3

New Web Story Copy 2023 08 28t140212.149

Chandrayaan-3: యావత్ ప్రపంచం చంద్రయాన్ గురించే చర్చిస్తుంది. జాబిల్లి దక్షిణ ధృవంపై చంద్రయాన్3 అడుగు పెట్టడం ప్రపంచ దేశాలు భారత్ ను పొగడ్తలతో ముంచేస్తున్నై. శత్రుదేశంగా భావించే పాక్ సైతం చంద్రయాన్3 మిషన్ సక్సెస్ ని కొనియాడింది. కానీ పొలిటికల్ లీడర్స్ దీనిపై రాజకీయం చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. చంద్రయాన్ జాబిల్లిపై అడుగు మోపిన ప్రదేశానికి ప్రధాని మోడీ శివశక్తిగా నామకరణం చేశారు. దీనిపై రాజకీయ రగడ మొదలైంది. తాజాగా హిందూ సంఘం అధ్యక్షుడు మరో బాంబ్ పేల్చాడు. ఈ సారి ఏకంగా చంద్రుని పేరునే మార్చాలని అంటున్నాడు. చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు చక్రబాణి మహారాజ్ అన్నారు.

చంద్రయాన్ 3 ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయిన ప్రాంతానికి ‘శివశక్తి’ అని, చంద్రయాన్ 2 ల్యాండర్ కుప్పకూలిన ప్రాంతానికి ‘తిరంగా’ అని ప్రధాని నరేంద్ర మోడీ గత వారం నామకరణం చేశారు. అయితే చాంద్రమాన్ ప్రాంతానికి హిందూ దేవుడి పేరు ‘శివశక్తి’ అని ప్రధాని మోదీ పేరు పెట్టారని కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీలు తప్పుబట్టాయి. కాగా, హిందూ మహాసభ అధ్యక్షుడు మరో వివాదం సృష్టించారు.చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ‘శివశక్తి’ పాయింట్‌ను రాజధానిగా చేయాలి. అప్పుడే జిహాదీ భావాలున్న ఉగ్రవాదులు అక్కడికి వెళ్లలేరు అని చెప్పాడు.అయితే చక్రబాణి మహరాజ్‌ వ్యాఖ్యలను వివిధ పార్టీలు ఖండిస్తున్నాయి.

Also Read: JP Nadda – Chandrababu : నడ్డాతో చంద్రబాబు ఏం మాట్లాడినట్లు..?