Site icon HashtagU Telugu

Monsoon: రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్..

Monsoon

Monsoon

రుతు పవనాలు వచ్చేస్తున్నాయి. అనుకున్న దాని కన్నా ముందుగానే భారత్ లో వర్షాలు కురవనున్నాయి. మే చివరి నాటికి దేశంలోని చాలా ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఇప్పటికే తెలిపింది. ఇదిలా ఉంటే మే 17 నుంచి కేరళలోని అన్ని జిల్లాలో నైరుతి రుతుపవనాల తొలకరి జల్లులు ప్రారంభం అవుతాయని ఐఎండీ తెలిపింది. ఈ నెల 17 నుంచి మేఘాలయ రాష్ట్రంలో కూడా అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అనేక జిల్లాలతో పాటు అస్సాం, మేఘాలయ, కేరళలోని అన్ని జిల్లాల్లో శనివారం నుంచి విపరీతమైన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

రాగల 24 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులను ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు  విస్తరించనున్నాయి. రాబోయే ఐదు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. రాబోయే ఐదు రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఉప-హిమాలయన్ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలలో విస్తారంగా తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కావేరి, కుట్టియాడి, భాతపుజా, కరువనూరు, కీచేరి మరియు పెరియార్ నదులలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నందున వచ్చే రెండు రోజుల పాటు కేరళలోని దాదాపు అన్ని జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని కేరళ మరియు తమిళనాడులోని ఘాట్ ప్రాంతాలకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) సలహా ఇచ్చింది. మే 18 , 19 తేదీలలో కోస్తా మరియు దక్షిణ అంతర్గత కర్ణాటకలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Exit mobile version