Site icon HashtagU Telugu

Monkey Pox in AP: ఏపీలో క‌ల‌క‌లం రేపుతున్న మంకీపాక్స్‌ …?

Monkey Pox

Monkey Pox

ఏపీలో మంకీపాక్స్ కేసు కలకలం సృష్టించింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు లాంటి లక్షణాలు కనిపించడంతో వైద్యులు మంకీపాక్స్ కేసుగా అనుమానిస్తున్నారు. చిన్నారికి విజ‌య‌వాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యులందరినీ ఐసోలేషన్లో ఉంచారు.

అయితే విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి మంకీపాక్స్ నెగటివ్ గా నిర్ధారణ అని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ వెల్లడించారు. దుబాయ్ నుండి వచ్చిన చిన్నారి కుటుంబాన్ని ఐసోలేషన్లో ఉంచామ‌ని .. ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని ఆయ‌న తెలిపారు. చిన్నారి నమూనాలను విమానంలో ఎన్ ఐవి, పూణెకి టెస్టింగ్ కోసం పంపించామ‌ని.. మంకీపాక్స్ నెగటివ్ అని నివేదిక వచ్చిందని తెలిపారు. ఏపీలో మంకీపాక్స్ పాజిటివ్ కేసులేవీ లేవని ఆయ‌న తెలిపారు.