Monkey : ఇప్పటికే ఆలయాల చుట్టుపక్కల కోతుల ఉద్రిక్తతలు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. భక్తుల చేతుల్లో ఉన్న ప్రసాదం, పళ్లలు, కొబ్బరి చిప్పలు ఇలా నచ్చినవన్నీ లాక్కెళ్లే ఈ కోతులు అప్పుడప్పుడు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బృందావనంలో ఓ కోతి ఘాటు పని చేసింది. బృందావన్‌లోని బాంకే బిహారీ ఆలయ దర్శనానికి వచ్చిన అలీఘర్‌కు చెందిన అభిషేక్ అగర్వాల్ కుటుంబంతో కలిసి వచ్చాడు. గుడిలో దొంగతనాల భయం ఉండటంతో, ఆయన తన భార్య ధరించిన రూ. 20 లక్షల విలువైన బంగారు నగలను ఓ పర్సులో భద్రపరిచాడు. కానీ ఆలయం నుంచి బయటికి వస్తున్న సమయంలో ఓ కోతి అనూహ్యంగా ఆ పర్సును లాక్కొని పారిపోయింది.
Cabinet Meeting : ఈ నెల 19న ఏపీ కేబినెట్ భేటీ..పలుకీలక అంశాలపై చర్చ
పర్సు కోతికి చిక్కడం చూసిన కుటుంబ సభ్యులు, తమ బంగారం పోతుందనే ఆందోళనతో వెంటనే గాలింపు చేపట్టారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు వారు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆలయం చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి, కోతిని గుర్తించారు. అనంతరం విస్తృతంగా గాలించి చివరకు పర్సును ఓ పొదల్లో దొరికించారు. తద్వారా రూ. 20 లక్షల విలువైన ఆ నగలను యథాతథంగా బాధితులకు తిరిగి అందజేశారు. సకాలంలో స్పందించిన పోలీసుల చొరవకు స్థానికులు మెచ్చుకోగా, కోతుల వల్ల ఆలయాలు ఎదుర్కొంటున్న సమస్యలపై మున్ముందు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Health Tips : ఈ తీగ పేరు సూచించినట్లుగానే ఆరోగ్య అమృతం..! మీరు దాని ప్రయోజనాలను తెలుసుకోవాలి.!