ప్రకృతిలో నివసించే జంతువులు అనూహ్యంగా ప్రవర్తించగలవని మనం చూస్తూనే, వింటూనే ఉంటాం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో ఉదాహరణగా నిలుస్తుంది. కోతి విషయంలో తేలికగా తీసుకోవడం ఎంత ప్రమాదకరం అన్న విషయం ఈ ఘటన చూస్తే అర్ధం అవుతుంది. ఒక కుర్రాడు తన బైక్ హ్యాండిల్‌పై కూర్చున్న కోతిని ‘స్నేహంగా’ అనుకుని లైట్ తీసి ముందుకు వెళ్తుండగా..అది ఒక్కసారిగా తిరగబడింది.
Perni Nani : అతి త్వరలో పేర్ని నాని జైలుకు..హింట్ ఇచ్చిన ఎమ్మెల్యే
ఒక్కసారిగా కుర్రాడి పైకి కోపంతో ఎగబడి, అతని పెదవిని గట్టిగా కోరికేసింది. దీంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం అయోమయం అయ్యింది. తీవ్రంగా రక్తస్రావం అవుతుండడం తో వెంటనే స్థానికులు హాస్పటల్ కు తరలించారు. ఈ ఘటనను ఓ వ్యక్తి ఫోన్ తో వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో అది కాస్త వైరల్ గా మారింది. జంతువులతో సరదాలు వద్దు..ఎంతవరకు ఉండాలో అంత వరకు ఉంటేనే ఇలాంటి ప్రమాదాలు జరగడవని కామెంట్స్ చేస్తున్నారు.
बंदर को भाभी समझ के बाइक पर बिठा के ले जा रहा था बंदर ने kiss किया जिंदगी भर नहीं भूलेगा 😂 pic.twitter.com/tgBSLzAx3T
— Reetesh Pal (@PalsSkit) July 12, 2025