Site icon HashtagU Telugu

Monitoring 100 Apps : గేమింగ్ యాప్స్ తో మత మార్పిడులు ? 100 యాప్స్ పై కేంద్రం ఫోకస్

Monitoring 100 Apps

Monitoring 100 Apps

Monitoring 100 Apps : దేశ ప్రజలు వినియోగిస్తున్న 100కుపైగా మొబైల్ యాప్‌లపై భారత ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. వాటి యాక్టివిటీపై నిఘా సంస్థలకు అనుమానాలు రావడంతో..  ఆ యాప్స్ ను ప్రత్యేకంగా  పర్యవేక్షించడం ప్రారంభించాయి. ఆ యాప్స్ ద్వారా ఆర్థిక నేరాలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలను మొదలుపెట్టాయి. ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్న ఈ యాప్స్ కు చెందిన క్రైమ్ నెట్‌వర్క్ విలువ రూ. 5 వేల కోట్లు ఉంటుందని కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి.

గేమింగ్ యాప్స్ లో  మతం మాటలు 

Volunt, Ayat Gun Simulator, Team Fight, Riot (హిందీలో అల్లర్లు అని అర్థం), Discord వంటి అనేక యాప్‌లు పిల్లలు, యూత్ ను మతమార్పిడుల దిశగా ప్రోత్సహిస్తున్నాయని అనుమానిస్తున్నారు. ఈ గేమింగ్ యాప్స్ లో మధ్యమధ్యలో ఒక స్టేజ్ నుంచి మరో స్టేజ్ కు మారే క్రమంలో.. ఒక మతానికి సంబంధించిన పద్యాలను చదవాలనే కండీషన్స్ పెడుతున్నారని, వాటిపై ప్రశ్నలు అడుగుతున్నారని అంటున్నారు. ఈ ఆన్సర్స్ పొందే క్రమంలో ఆప్షన్స్ ను క్లిక్ చేయగానే.. కొందరు మత ప్రబోధకుల వీడియోలను షేర్ చేయాలనే కండీషన్ ను యూజర్స్ కు పెడుతున్నట్లు చెబుతున్నారు. ఓ మతానికి చెందిన పేర్లు పెట్టుకున్న కొందరు వ్యక్తులు ఈ గేమ్స్ ఆడుతూ.. అమాయక పిల్లలు, యూత్ ను మాటల్లో పెట్టి మరో మతం వైపునకు ఆకర్షించేందుకు ట్రై చేస్తున్నారని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.

Also read : Tiktoker-Death : టిక్‌టాక్ ‘స్కార్ఫ్ గేమ్’ కు బాలిక బలి

విదేశాల్లో ఉద్యోగాలను ఇప్పిస్తామంటూ మోసం చేసే యాప్స్ 

ఇలాంటి యాప్స్ (Monitoring 100 Apps) జాబితాలో జాబిన్ అబ్రాడ్, గల్ఫ్ జాబ్, యుకె-యుఎస్ జాబ్ కూడా ఉన్నాయని నిఘా వర్గాలు చెప్పాయి. ఈ యాప్స్ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలను  ఇప్పిస్తామంటూ యూత్ ను..  ముఖ్యంగా బాలికలను మోసం చేస్తున్నట్టు ఇంటెలీజెన్స్ వర్గాలకు తెలిసింది.  ఈ యాప్స్ ను నమ్మి డబ్బులు కట్టే వాళ్ళను విదేశాలకు తీసుకెళ్లి.. జాబ్స్ ఇప్పించకుండానే వదిలేస్తున్నారని గుర్తించారు. క్రిప్‌వైజర్ లాంటి యాప్‌లను ఉగ్రవాదులు నడుపుతున్నారని అనుమానిస్తున్నారు. ఇంతకుముందు ఇలాంటి కొన్ని యాప్‌లను కేంద్ర ఏజెన్సీలు గుర్తించగానే నిషేధం విధించారు. కానీ మరుసటి రోజే ఉగ్ర మూకలు కొత్త డొమైన్ లను అవే పేరుతో మళ్లీ యాక్టివ్ చేశారని తెలిసింది . అలాంటి యాప్స్ లిస్టులో Crypvisor, Enigma, SafeSwiss, Vikrami, Conion, Element, Jangi, Media Fire, Briar, Beechat, Nand Box, IMO, Second Line, Threema మొదలైనవి ఉన్నాయని చెబుతున్నారు.