Site icon HashtagU Telugu

Money on Mango Tree: మామిడి చెట్లకు డబ్బులు

Money For Mango Tree In Karnataka

Money For Mango Tree In Karnataka

Mango Tree : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ ఉత్కంఠ రేపుతున్న ప్రస్తుత తరుణంలో మైసూరులోని ఓ చెట్టుపై దాచిన కోటి రూపాయలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ సోదరుడు సుబ్రమణ్య రాయ్ పై జరిపిన ఐటీ సోదాల్లో.. ఆయన ఇంటి ఆవరణలోని మామిడి చెట్టుపై (Mango Tree) దాచిన డబ్బు పెట్టెను అధికారులు సీజ్ చేశారు. అందులో ఎంత క్యాష్ ఉందని లెక్కపెట్టగా.. కోటి రూపాయలు ఉన్నట్టు తేలింది. దీంతో ఆ డబ్బు ఎక్కడిది అనే ప్రశ్న ఉదయించింది. ఎన్నికల ప్రచారానికి అక్రమంగా వినియోగించేందుకే ఈ డబ్బును దాచారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఐటీ అధికారులు ఈ విషయంపై విచారణ ప్రారంభించారు. ఈ ఐటీ రైడ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో ఐటీ శాఖ వరుసగా రైడ్స్ చేస్తోంది. ఈక్రమంలోనే ఏప్రిల్ 13న బెంగళూరు పోలీసులు సిటీ మార్కెట్ ఏరియా సమీపంలో ఆటోలో తరలిస్తున్న రూ. కోటి నగదును సీజ్ చేసి, ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు.

Also Read:  Rahul Gandhi: రాహుల్ కు మరో ఎదురుదెబ్బ