Mohanbabu : పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ప్రముఖ నటుడు మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. మీడియా ప్రతినిధులపై దాడి ఆరోపణల నేపథ్యంలో భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్ 109 కింద ఈ కేసు నమోదైంది. పోలీస్ వారు తీసుకున్న న్యాయ సలహా ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంతకుముందు ఈ ఘటనపై సెక్షన్ 118(1) BNS కింద కేసు నమోదు చేయడం జరిగింది. మంగళవారం రాత్రి మంచు కుటుంబంలో జరుగుతున్న కుటుంబ విభేదాల నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. జల్పల్లి ప్రాంతంలో మోహన్ బాబు నివాసం వద్ద మీడియా ప్రతినిధులు సంఘటనను కవర్ చేయడానికి చేరుకున్నారు. ఈ సమయంలో, నటుడు మంచు మనోజ్ తలుపులు తోసుకొని లోపలికి వెళ్తుండగా, మీడియా ప్రతినిధులు అతడిని అనుసరించి లోపలికి ప్రవేశించారు.
Judge Vs India Bloc : ‘‘హిందుస్తాన్’’ వ్యాఖ్యలు.. హైకోర్టు జడ్జిపై ‘ఇండియా’ కూటమి అభిశంసన తీర్మానం
ఈ సమయంలో, మోహన్ బాబు ఇంటి నుండి బయటకు వచ్చి, ఒక జర్నలిస్ట్ చేతిలో ఉన్న మైక్‌ను బలవంతంగా లాగడం, ఆ మైక్‌తోనే అతడిని దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో జర్నలిస్ట్‌కు తీవ్రమైన గాయాలు అయ్యాయి. అదనంగా, అక్కడ ఉన్న బౌన్సర్లు ఇతర మీడియా ప్రతినిధులపై కూడా దౌర్జన్యంగా ప్రవర్తించి పలువురిపై దాడి చేశారు. ఈ ఘటనలన్నింటి ఆధారంగా పోలీస్ వారు ఈ కేసును నమోదు చేశారు. అయితే.. ఈ ఘటన అనంతరం అనూహ్యంగా మోహన్‌బాబు హైబీపీతో ఆనారోగ్యానికి గురయ్యారని, కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మంచు విష్ణు వెల్లడించారు.
అయితే.. నిన్న ఉదయం రాచకొండ సీపీ ముందు మంచు బ్రదర్స్ వేరు వేరుగా హాజరయ్యారు. ఘర్షణ వాతావరణం క్రియేట్ చేయవద్దని.. ఒక వేళ ఏమైనా గొడవ జరిగిన మీదే బాధ్యతంటూ ఇద్దరి వద్ద నుంచి రూ.లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు బాండ్లు తీసుకున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. ఈ రోజు మోహన్ బాబు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఇప్పటికే మీడియాపై దాడికి జర్నలిస్టులు నిరసన తెలిపారు. మోహన్ బాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Yuvraj Singh Birthday : రికార్డుల రారాజు యువ‘రాజ్’కు హ్యాపీ బర్త్‌డే.. కెరీర్ విశేషాలివీ