Site icon HashtagU Telugu

Punjab: రాహుల్ గాంధీ పై పంజాబ్ కాంగ్రెస్ ఫైర్

Template 2021 12 31t113433

Template 2021 12 31t113433

రాహుల్ గాంధీ పై మరోసారి పంజాబ్ కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనవరి 3న మోగా జిల్లాలో రాహుల్ గాంధీ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించాల్సి ఉండగా.. అయన న్యూ ఇయర్ వేడుకల కొరకు ఇటలీ వెళ్లారు. ఈ విషయం తెలిసిన రాష్ట్ర పార్టీ నేతలు ర్యాలీ ని రద్దు చేసుకున్నారు. అనేక గ్రూపులుగా ఏర్పడ్డ పంజాబ్ కాంగ్రెస్ ను ఒక వేదిక పైకి తీసుకురావడానికి ఈ ర్యాలీ ఒక మంచి అవకాశమని ఒక ముఖ్యనేత అన్నారు. పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఉన్నపటికీ అన్ని నిర్ణయాలు రాహుల్ గాంధీ తీసుకుంటున్నారు కానీ పార్టీ అధ్యక్షుడిగా మాత్రం బాధ్యతలు చేపట్టడం లేదు. ఒక జాతీయ పార్టీకి నేతగా ఉండాలంటే 24 గంటలు పార్టీ కోసమే పని చేయాలి. ఇప్పటికే సీనియర్లు రాహుల్ గాంధీ పై అసంతృప్తితో ఉన్నారు. కపిల్ సిబాల్, శశి థరూర్ లాంటి సీనియర్లు ఇప్పటికే బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు.

అయితే రాజకీయంగా కీలక పరిణామాలు జరిగే సందర్భాల్లో రాహుల్‌ విదేశాలకు వెళ్తుండటం.. ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు జనవరి మొదటివారంలో షెడ్యూల్‌ విడుదల కానుంది. ఈ ఏడాది రాహుల్‌ గాంధీ నాలుగుసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. మొత్తం 25 రోజులు విదేశాల్లో గడిపారు.

రాహుల్‌ తాజా పర్యటన, విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ స్పందిస్తూ.. వ్యక్తిగత పర్యటన నిమిత్తమే రాహుల్‌ గాంధీ ఇటలీకి వెళ్లారని, దీనిపై అనవసరంగా వదంతులు సృష్టించవద్దని పార్టీ ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా అన్నారు.