Site icon HashtagU Telugu

Modi: కాన్పూర్ లో మోడీ పర్యటన.. పలు ప్రాజెక్టులు ప్రారంభం

ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పర్యటించ‌నున్నారు. ఐఐటీ-కాన్పూర్‌ 54వ స్నాతకోత్సవానికి ప్రధాని  హాజరవుతారు. కాన్పూర్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టులో ఇప్పటి దాకా పూర్తయిన భాగాన్ని ప్రారంభిస్తారు. ‘బినా-పంకి’ బహుళ ఉత్పత్తుల పైప్‌లైన్‌ ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తారు. కాన్పూర్‌  మెట్రోరైల్‌ ప్రాజెక్టు పనులపై తనిఖీ నిమిత్తం ప్రధానమంత్రి ఐఐటీ మెట్రో స్టేషన్‌ నుంచి గీతానగర్ వరకు మెట్రో రైలులో ప్రయాణిస్తారు. ఈ మెట్రోరైల్‌ ప్రాజెక్టు మొత్తం పొడవు 32 కిలోమీటర్లు కాగా, 11 వేల కోట్ల రూపాయ‌ల‌తో దీన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version