Modi Mother: మోడీ తల్లి పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తరలింపు!

ప్రధాని నరేంద్ర మోడీ (Pm Modi) తల్లి అనారోగ్యానికి గురయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Modi Mother

Modi With Mother

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తల్లి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. హీరాబెన్ మోడీ (Heeraben Modi) ఆరోగ్యం క్షీణించడంతో అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది. శ్వాసకోశ వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. నిన్న రాత్రి ఆమె చాలా ఇబ్బందికి గురి కావడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

కాగా మరో ఘటనలో ప్రధాని మోదీ తమ్ముడు (Modi Brother) ప్రహ్లాద్ మోదీ మంగళవారం కారు ప్రమాదంలో గాయపడ్డారు. అతను తన కొడుకు, కోడలు, మనవడితో కలిసి బందీపూర్‌కు వెళుతుండగా, కర్ణాటకలోని మైసూరు సమీపంలో మెర్సిడెస్ బెంజ్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. రెండు రోజుల వ్యవధిలోనే ఈ వరుస ఘటనలు చోటుచేసుకున్నాయి.

Also Read : KVS Recruitment 2022: కేవీఎస్ లో పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం!

  Last Updated: 28 Dec 2022, 02:25 PM IST