Site icon HashtagU Telugu

Sumalatha: మూడోసారి మోదీ ప్రధాని అవుతారు : నటి సుమలత

Sumalatha

Sumalatha

Sumalatha: పలు సర్వేలతో పాటు బీజేపీ నేతలు, నాయకులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీనియర్‌ నటి సుమలత మళ్లీ మోడీ అంటూ తేల్చి చెప్పారు. తిరుమల శ్రీవారిని  దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేశంలో మళ్లీ భాజపానే అధికారంలోకి వస్తుందని, మూడోసారి మోదీ ప్రధాని అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

2024 లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడు పర్యాయాలు గెలిచిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ అవుతారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం తిరిగి ఏర్పడుతుందని దాదాపు అన్ని సర్వేలు అంచనా వేశాయి. బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) కూడా 400+ స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేసింది.