భారత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. మోడీ రాక సందర్భంగా గుజరాత్ రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. వెల్ కం మోడీజీ అంటూ స్వాగతం పలికారు అక్కడి ప్రజలు. మోడీ కూడా ప్రజలతో కరచాలనం చేస్తూ ఉత్సాహం నింపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్‌లోని జాంనగర్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ప్రజలు భారీగా తరలిరావడంతో తన కాన్వాయ్ దిగి ప్రజలకు అభివాదం చేశారు. ఈ క్రమంలో ఓ అభిమాని తన తల్లితో కలిసి ఉన్న చిత్రాన్ని మోదీకి అందజేశారు. దీనికి సంతోషించిన ప్రధాని.. మరో ఫొటోను కూడా తెప్పించుకున్నారు. దానిపై సంతకం చేసి ఆ అభిమానికి గుర్తుగా అందజేశారు.
🔴మూడు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్లో ఉన్న మోదీ.. జాంనగర్‌లో రోడ్ షో నిర్వహించారు.
🔴ఈ రోడ్ షోకు ప్రజలు భారీగా తరలిరావడంతో తన కాన్వాయ్ దిగి ప్రజలకు అభివాదం చేశారు.
🔴ఈ క్రమంలో ఓ అభిమాని తన తల్లితో కలిసి ఉన్న చిత్రాన్ని మోదీకి అందజేశారు. pic.twitter.com/b8fQemwNfU— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) October 11, 2022