ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) జనవరి 8న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన కు సంబదించిన షెడ్యూల్ ఖరారైంది. షెడ్యూల్ ప్రకారం.. సా.4.15 గంటలకు నగరానికి చేరుకుంటారు. సిరిపురం కూడలి నుంచి AU ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అక్కడ గంటసేపు ప్రధాని సభ కొనసాగనుంది.
విశాఖ రైల్వే జోన్, NTPC ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ హబ్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ పనులకు శంకుస్థాపన చేస్తారు. రా.7 గంటలకు తిరిగి భువనేశ్వరు బయలుదేరుతారు. ఇక ఎన్నికల్లో బిజెపితో కలిసి జనసేన, టీడీపీ పోటీ చేసి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మోడీ సహకారం తో ఈరోజు రాష్ట్రం ఎంతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. ఇప్పటికే వేలాది కోట్లు రాష్ట్రానికి అందజేసి మోడీ..ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. అలాగే మోడీ వైజాగ్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి నేతలు పాల్గొననున్నారు.
Read Also : Pawan Kalyan: చిరంజీవి వారసుడు ఇలా కాకుంటే ఎలా ఉంటాడు: పవన్ కల్యాణ్
