Modi Surname-Rahul Gandhi : రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం కేసులో తీర్పు నేడే

Modi Surname-Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు ఈరోజు (శుక్రవారం) తీర్పు ఇవ్వనుంది.

Published By: HashtagU Telugu Desk
Rahul In Us

Rahul In Us

Modi Surname-Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు ఈరోజు (శుక్రవారం) తీర్పు ఇవ్వనుంది. 2019లో కర్నాటకలోని కోలార్‌లో జరిగిన బహిరంగ సభలో  ‘దొంగలందరికీ ఇంటిపేరు మోడీ అనే ఎందుకు ఉంటుంది’ అని వ్యాఖ్యానించినందుకు రాహుల్‌పై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ క్రిమినల్ పరువు నష్టం కేసు పెట్టారు. ఈ కేసును విచారించిన సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని గుజరాత్ హైకోర్టులో రాహుల్ సవాల్ చేశారు. హైకోర్టు గురువారం జారీ చేసిన కాజ్ లిస్ట్ ప్రకారం ఉదయం 11 గంటలకు జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ తీర్పు ఇవ్వనున్నారు. రాహుల్‌ను నిర్దోషిగా తీర్పు ఇస్తే.. రద్దయిన ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు మార్గం సుగమం అవుతుంది.

Also read : 100 Year Old Banyan Tree : ప్రకృతిపై ప్రేమంటే ఇదే.. వందేళ్ల మర్రిచెట్టును మళ్ళీ బతికించిన అనిల్ గొడవర్తి

మూడు రోజుల క్రితమే..

మరోవైపు ఇదే విషయమై(Modi Surname-Rahul Gandhi) గతంలో రాంచీలోనూ  రాహుల్  గాంధీపై బీజేపీ నేత ప్రదీప్ మోడీ పరువునష్టం కేసు వేశారు. ఈ కేసులో మూడు రోజుల క్రితమే (జులై 4న) రాహుల్‌ కు జార్ఖండ్‌ హైకోర్టులో ఊరట లభించింది. రాహుల్‌పై చర్యలు తీసుకోకుండా జార్ఖండ్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై ఆగస్టు 16కు విచారణ వాయిదా వేసింది.

  Last Updated: 07 Jul 2023, 09:22 AM IST