2021, 22 సంవత్సరాలకు గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-కు ఎంపికైన బాలలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పురస్కారాలను ప్రదానం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో హిమప్రియ, కలెక్టర్ శ్రీకేష్ లఠకర్ తో కలిసి పాల్గొన్నారు. అవార్డును అందుకున్న హిమప్రియను జిల్లా అధికార యంత్రాంగం ప్రశంసించింది. 2018 ఫిబ్రవరి 10.. జమ్మూ ప్రాంతంలోని ఆర్మీ క్వార్ట ర్స్ పై ఉగ్రమూక దాడికి తెగబడింది. ఆర్మీ జవానైన తండ్రి ఆ సమయంలో ఇంటిలో లేకపోయినా ఉగ్రవాదులకు ఎదురెళ్లింది. ఒంటి నిండా దెబ్బలు తగిలినా వెరవకుండా తన తల్లితో పాటు తోటి వారిని కాపాడేందుకు ప్రయత్నించింది. దేశం కోసం ఉగ్రమూకలకు ఎదురు తిరగడం గర్వంగా ఉంది అని హిమప్రియ పేర్కొంది.
PM Modi: బాలలకు పురస్కారాలు ప్రదానంచేసిన మోడీ!

Modi Elections