PM : 5g సేవలను ప్రారంభించిన మోదీ..!!

5జీ సేవలను ప్రారంభించారు ప్రధానమంత్రి మోదీ. కొద్దిసేపటి క్రితం ఈ సేవలను ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ప్రారంభించారు.

  • Written By:
  • Updated On - October 1, 2022 / 11:04 AM IST

5జీ సేవలను ప్రారంభించారు ప్రధానమంత్రి మోదీ. కొద్దిసేపటి క్రితం ఈ సేవలను ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ప్రారంభించారు. 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించిన అనంతరం 5జీ సేవలను ప్రారంభించారు. ఈ 5జీ సేవలు ముందుగా మెట్రో నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. రెండేళ్ల తర్వాత దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.5జీ సర్వీస్ అనేది కొత్త ఆర్థిక అవకాశాలతోపాటు సామాజిక ప్రయోజనాలను కూడా ఆవిష్కరించగలదని…మంత్రిత్వశాఖ తెలిపింది.ని, ఇది దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించడంతోపాటుగా ‘డిజిటల్ ఇండియా’ విజన్ ను ముందుకు తీసుకెళ్తుంది. 2035నాటికి భారత్ పై 5జీ ఆర్థిక ప్రభావం 450 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

అందరూ రెడీ

మరోవైపు 5జీ కమర్షియల్ లాంచ్ కూడా అక్టోబర్‌లోనే ఉండనుంది. 5జీ నెట్‌వర్క్‌ను ఇదే నెలలో అందుబాటులోకి తీసుకొస్తామని Reliance Jio, Airtel ఇప్పటికే వెల్లడించాయి. ముందుగా ప్రధాన మెట్రో నగరాల్లో 5జీని (5G Network launch) లాంచ్ చేయనున్నాయి జియో, ఎయిర్‌టెల్‌. దీపావళి కల్లా 5జీని అందుబాటులోకి తెస్తామని జియో వెల్లడించగా.. ఈనెలలో ఎప్పుడైనా 5జీని ప్రారంభిస్తామని ఎయిర్‌టెల్‌ చెప్పింది. మరోవైపు ఆర్థిక కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా ఈనెలలో 5జీని తీసుకురావడం కష్టంగానే ఉంది.

టెక్నాలజీలో మార్పులు

5జీకి దేశ ప్రజలు కూడా సిద్ధమవుతున్నారు. 5జీ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి కనిపించడమే దీనికి నిదర్శనంగా ఉంది. అయితే ముందుగా పెద్ద నగరాల్లోని వారికే 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుంది. చిన్న నగరాలు, గ్రామాలకు వచ్చేందుకు కనీసం ఏడాది సమయమైనా పట్టొచ్చు. మొత్తంగా అయితే రెండేళ్ల కాలంలో 5జీ పూర్తిస్థాయిలో విస్తరిస్తుందని అంచనాలు బలంగా ఉన్నాయి. మొబైల్‌ యూజర్లకు వేగవంతమైన ఇంటర్నెట్‌తో పాటు ఎంటర్‌టైన్‌ మెంట్, ఎడ్యుకేషన్, వైద్య, పారిశ్రామిక రంగాల్లో 5జీ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడనుంది. ఇప్పటికే ఈ మూడు ప్రైవేట్ టెలికం సంస్థలు.. వివిధ రంగాల్లో 5జీని ఉపయోగించేలా టెక్నాలజీలను డెవలప్‌ చేశాయి.