Site icon HashtagU Telugu

Shabbir Ali : వాళ్లిద్ద‌రూ ఫిరాయింపులు ప్రోత్స‌హిస్తున్నారు – మాజీ మంత్రి ష‌బ్బీర్ అలీ

Shabbir Ali

Shabbir Ali

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీకి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల‌కు రాజ్యాంగంపై గౌరవం లేదని టీ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి ష‌బ్బీర్ అలీ ఆరోపించారు.వీరిద్ద‌రు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నార‌ని తెలిపారు. గోవా, మణిపూర్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టేందుకు మోదీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టగా.. 2014 నుంచి తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ బలం పుంజుకున్నారని షబ్బీర్‌ అలీ తెలిపారు.

2014 జూన్‌ నుంచి అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లలో ప్రతిపక్ష కాంగ్రెస్‌, టీడీపీ, బీఎస్పీలకు చెందిన నలుగురు ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారని తెలిపారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు కేసీఆర్ ఈ వ్యూహాన్ని ఉపయోగించారని.. రెండోసారి 12 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు చేశార‌ని గుర్తు చేశారు. రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలన్న ఫిర్యాదులపై అప్పటి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ చర్యలు తీసుకోలేదని షబ్బీర్ అలీ అన్నారు. ‘‘టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను మంత్రివర్గంలో చేర్చుకున్న కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా శ్రీనివాస్ యాదవ్ టీఆర్‌ఎస్ టికెట్‌పై మళ్లీ ఎన్నిక కావాల్సి ఉందని.. అయితేకేసీఆర్ ఉదాసీనంగా ఏడాది గడిచినా అప్పటి స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.