PM Modi: అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ కన్నుమూయడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 71 ఏళ్ల విజయకాంత్ కోవిడ్ -19 బారిన పడిన తర్వాత వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్నారని ఆయన పార్టీ తెలిపింది. అయితే అతనికి న్యుమోనియా ఉందని తెలిసింది. “కెప్టెన్ విజయకాంత్ న్యుమోనియాతో అడ్మిట్ అయిన తరువాత వెంటిలేటరీ సపోర్ట్‌లో ఉన్నారు. వైద్య సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ మరణించాడు.” అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
“తిరు విజయకాంత్ జీ మరణించడం చాలా బాధ కలిగించింది. తమిళ చలనచిత్ర ప్రపంచంలో ఒక లెజెండ్, ఆయన నటన మిలియన్ల మంది హృదయాలను కొల్లగొట్టాయి. రాజకీయ నాయకుడిగా, అతను ప్రజా సేవకు గాఢంగా కట్టుబడి ఉన్నాడు. , తమిళనాడు రాజకీయ దృశ్యంపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. అతను సన్నిహిత మిత్రుడు. సంవత్సరాలుగా అతనితో మంచి సంబంధాలున్నాయని మోడ అన్నారు. విజయ కాంత్ మరణంతో తమిళనాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి.