Modi Cabinet: మోడీ కేబినెట్ సమావేశం… కీలక నిర్ణయాలు

బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Published By: HashtagU Telugu Desk
Modi Cabinet

New Web Story Copy 2023 05 17t165511.739

Modi Cabinet: బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌, మన్‌సుఖ్‌ మాండవియా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో ఈ ఏడాది దేశంలో 100 బిలియన్‌ డాలర్లు ఉత్పత్తి చేశామన్నారు. దీంతో గతేడాది రికార్డు స్థాయిలో 11 బిలియన్‌ డాలర్ల మొబైల్‌ ఎగుమతి జరిగిందని తెలిపారు. ఐటీ హార్డ్‌వేర్‌కు సంబంధించిన పీఎల్‌ఐకి ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించిందని తెలిపారు.టెలికాం తయారీ రంగంలో 42 కంపెనీలు తొలి ఏడాది రూ.900 కోట్లకు బదులుగా రూ.1600 కోట్ల పెట్టుబడులు పెట్టాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు.

ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ ప్రకటించింది. దేశంలో 325 నుంచి 350 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగిస్తున్నట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. 100 నుంచి 125 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ, ఎన్ పీకే వినియోగిస్తున్నారు. 50-60 లక్షల మెట్రిక్ టన్నుల MOP ఉపయోగించబడుతుంది. అయితే రైతులకు సకాలంలో ఎరువులు అందేలా మోదీ ప్రభుత్వం సబ్సిడీని పెంచింది కానీ, ఎంఆర్‌పీని మాత్రం పెంచలేదు. కాగా.. భారత ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌లో పంటల కోసం 1 లక్షా 8 వేల కోట్ల రూపాయల సబ్సిడీని ఖర్చు చేస్తుంది.

Read More: Y Not Jagan : అమ్మో..YS ఫ్యామిలీ! DK వెనుక‌ `వై నాట్ క‌ర్ణాట‌క `!!

  Last Updated: 17 May 2023, 05:00 PM IST