Site icon HashtagU Telugu

‘Era is not of war’: చర్చలతోనే సమస్యకు పరిష్కారం..యుద్ధం ఆపాలంటూ పుతిన్ ను కోరిన మోదీ..!!

PM Modi To Russia

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భారత ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. ఈ సమావేశం దాదాపు గంటపాటు సాగింది. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య మైత్రి, తాజా పరిస్థితులపై చర్చించారు ఇరు దేశాల అధినేతలు. రష్యా, భారత్ ల మధ్య వాణిజ్య, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారంపై మోదీ, పుతిన్ చర్చించుకున్నారు.

ముఖ్యంగా ఉక్రెయిన్ లో రష్యా యుద్ధంపైనా చర్చ జరిగింది. చర్చలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని…ఉక్రెయిన్ విషయంలోనూ ఇదే అనుసరిస్తే…మంచి ఫలితాలు వస్తాయని పుతిన్ కు మోదీ సూచించారు. ఉక్రెయిన్ సాధారణ వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టాలంటూ బహిరంగంగానే మోదీ పుతిన్ ను కోరారు.