Modi Ex-gratia: కామారెడ్డి మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది  మృతిచెందారు.

  • Written By:
  • Updated On - May 9, 2022 / 12:36 PM IST

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది  మృతిచెందారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సంతాపం వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50,000 పరిహారం కూడా ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఓ ట్వీట్‌ చేసింది “తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదం కారణంగా ప్రాణనష్టం కలగడం బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున మరణించిన బంధువులకు అందించబడుతుంది. కాగా ప్రమాదంలో గాయపడినవాళ్లకు రూ.50,000 ఇస్తాం’’ అని వెల్లడించింది.

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా హసన్‌పల్లి వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన భారీ రోడ్డు ప్రమాదంలో లారీ, మినీ వ్యాన్‌ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. మినీవ్యాన్‌లోని వ్యక్తులు యల్లారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి గేటు వద్ద ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి నిందితుడు లారీ డ్రైవర్‌ను గుర్తించినట్లు కామారెడ్డి పోలీస్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. “మేం అతన్ని త్వరలో పట్టుకుంటాము’’ అని అన్నారు.  మృతుల వివరాలు ఇవే.. అంజవ్వ (35 సంవత్సరాలు), వీరమణి (35 సంవత్సరాలు), లచ్చవ్వ (60 సంవత్సరాలు), సాయవ్వ (38 సంవత్సరాలు), సాయిలు (35 సంవత్సరాలు), ఎల్లయ్య (53 సంవత్సరాలు), పోశయ్య (60 సంవత్సరాలు), గంగవ్వ ( 45 ఏళ్లు), వీరవ్వ (70 ఏళ్లు).