Site icon HashtagU Telugu

Rains: తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు ఛాన్స్!

Weather Update

Hyd Rains Imresizer

ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది. అవి గంటకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉన్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా అదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ బాద్, వరంగల్, హన్మ కొండ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు రావచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

ప్రస్తుతం ఈ గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుండి రాష్టం మీదకు వీస్తున్నాయి. రాష్ట్రానికి వర్షాలు వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 15, 16,17 వ తేదీలలో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.