Site icon HashtagU Telugu

India-Bangladesh Border : ఇండియా – బంగ్లాదేశ్ సరిహద్దులో భారీగా మొబైల్ ఫోన్లు స్వాధీనం

Terrorist Killed

Bsf Imresizer

భారత్-బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ బోర్డర్ (ఐబి) సమీపంలో భారీగా మొబైల్ ఫోన్లు దొరికాయి. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) రూ.39ల‌క్ష‌ల విలువైన మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు శనివారం దళాలు తెలిపాయి. సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ కింద ఉన్న BSF 70 బెటాలియన్ దళాలు, బోర్డర్ అవుట్ పోస్ట్ సుఖ్‌దేవ్‌పూర్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద శుక్రవారం అర్థరాత్రి 359 మొబైల్ ఫోన్‌ల సరుకును స్వాధీనం చేసుకున్నాయి. బీఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ మూలాల నుండి అందిన ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ సీజ్ జరిగిందని అధికారులు తెలిపారు.