Nikhat Zareen: వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌ నిఖ‌త్‌కు బ్ర‌హ్మ‌ర‌థం

మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్ బాక్సింగ్‌లో చాంపియ‌న్‌షిప్‌లో ప‌సిడి ప‌త‌కం సాధించిన ఎంఎల్ఆర్ఐటీ ఎంబీఏ విద్యార్థి నిఖ‌త్ జ‌రీన్‌కు ఆ క‌ళాశాల విద్యార్థులు బ్ర‌హ్మ‌రథం ప‌ట్టారు.

  • Written By:
  • Updated On - May 30, 2022 / 01:44 PM IST

* ఎంఎల్ఆర్ఐటీ ప్రోత్సాహానికి రుణ‌ప‌డి ఉంటా: నిఖ‌త్ జ‌రీన్‌

* రూ.4 ల‌క్ష‌లు చెక్ ప్ర‌దానం చేసిన ఎంఎల్ఆర్ఐటీ సెక్ర‌ట‌రీ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

హైద‌రాబాద్‌: మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్ బాక్సింగ్‌లో చాంపియ‌న్‌షిప్‌లో ప‌సిడి ప‌త‌కం సాధించిన ఎంఎల్ఆర్ఐటీ ఎంబీఏ విద్యార్థి నిఖ‌త్ జ‌రీన్‌కు ఆ క‌ళాశాల విద్యార్థులు బ్ర‌హ్మ‌రథం ప‌ట్టారు. శ‌నివారం ఉద‌యం గండి మైస‌మ్మ స‌ర్కిల్ నుంచి ఎంఎల్ఆర్ఐటీ విద్యార్థులు బైక్ ర్యాలీ చేస్తూ నిఖ‌త్‌ను ఓపెన్ టాప్ జీప్‌పై ఊరేగింపుగా దుండిగ‌ల్‌లోని క‌ళాశాల‌కు తోడ్కొని వెళ్లారు.

ఎంఎల్ఆర్ఐటీ విద్యాసంస్థ‌ల చైర్మ‌న్ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ప్రిన్సిప‌ల్ శ్రీనివాస‌రావు నిఖ‌త్‌తో పాటు జీప్‌లో ఊరేగింపులో పాల్గొన్నారు. అనంత‌రం ఆడిటోరియంలో నిఖ‌త్‌కు ఏర్పాటు చేసిన స‌న్మాన కార్య‌క్ర‌మంలో వెయి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. జైహో నిఖ‌త్ అంటూ విద్యార్థుల క‌ర‌తాళ ధ్వ‌నులతో ఘ‌న స్వాగతం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఎంఎల్ఆర్ఐటీ సెక్ర‌ట‌రీ, టీఆర్ ఎస్ మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట‌రీ ఇన్‌చార్జ్ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి మాట్లాడుతూ ఒక సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలో జ‌న్మించి.. ఎన్నో వ్యయ‌ప్ర‌యాస‌లు ప‌డి, కఠోర సాధ‌నతో వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించిన నిఖ‌త్‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని చెప్పారు. విజ‌యం ఎవ‌రినీ సుల‌భంగా వ‌రించ‌ద‌ని, ప‌దేళ్ల‌గా నిఖ‌త్ ప‌డిన క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం ఈ వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్ ప‌త‌క‌మ‌ని అన్నారు.

నిఖ‌త్ స్ఫూర్తిదాయ‌క కెరీర్‌ను చూసి ఈ ఏడాది ప్రారంభంలో త‌న‌కి ఉచితంగా ఎంబీఏ సీటు ఇచ్చామ‌ని, త‌న‌ను మ‌రింత ప్రోత్స‌హించాల‌నే ఉద్దేశంతో ఇప్పుడు రూ.4 ల‌క్ష‌ల చెక్‌ను అందిస్తున్న‌ట్టు తెలిపారు. తమ కళాశాల MLRIT లో స్పోర్ట్స్ కోటా కింద ప్రతీ ఏటా 30 మందికి ఉచిత విద్య ను అందిస్తున్నామని ,1.25 కోట్ల రూపాయల వ్యయం తో స్పోర్ట్స్ కోటా కింద స్కాలర్షిప్ అందిస్తున్నామని తెలిపారు. అనంత‌రం నిఖ‌త్ మాట్లాడుతూ ఎంఎల్ ఆర్ ఐటీ చైర్మ‌న్ ల‌క్ష్మ‌ణ్ రెడ్డి, రాజ‌శేఖ‌ర్ రెడ్డి అందిస్తున్న ప్రోత్సాహానికి రుణ‌ప‌డి ఉంటాన‌ని కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. అమ్మాయిలు ఎందులోనూ త‌క్కువ కాద‌ని.. అబ్బాయిల‌కు దీటుగా అన్నిరంగాల్లోనూ అమ్మాయిలు రాణించేందుకు కృషి చేయాల‌ని చెప్పింది. కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో ప‌త‌కం సాధించి మ‌ళ్లీ క‌ళాశాల‌కు వ‌స్తాన‌ని నిఖ‌త్ తెలిపింది. ఈ స‌న్మాన కార్య‌క్ర‌మంలో స‌త్తి రెడ్డి, జాతీయ మాజీ బ్యాడ్మింట‌న్ కోచ్ భాస్క‌ర్ బాబు, ప్రిన్సిపల్ డాక్టర్ కె శ్రీనివాసరావు. ఫ్యాక‌ల్టీ స‌భ్యులు తదితరులు పాల్గొన్నారు.