Site icon HashtagU Telugu

Delhi Liquor Scam: కాకా పుట్టిస్తున్న సుఖేష్ చాట్.. కవిత ఫోన్ నంబర్స్ లీక్

Mlc Kavitha

Mlc Kavitha

Delhi Liquor Scam: సుఖేష్ లీక్స్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రోజుకొక వాట్సాప్ చాట్ సందేశాన్ని లీక్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ మేరకు సుఖేష్ చంద్రశేఖర్ తాజాగా ఎమ్మెల్సీ కవితతో జరిపిన మరో వాట్సాప్ చాట్ ని బయటపెట్టాడు.

ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అరుణ్ పిళ్ళై, ఇతర వ్యక్తుల్ని కస్టడీలోకి తీసుకుంది. ఇటీవల ఎమ్మెల్సీ కవితను కూడా విచారించింది. అయితే మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న సుఖేష్‌ చంద్రశేఖర్ తన తరుపు లాయర్ ద్వారా తనతో సంబంధం ఉన్న వ్యక్తుల్ని బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నాడు. ఎమ్మెల్సీ కవిత అతనితో వాట్సాప్ సంభాషణ జరిపినట్టు ఇప్పటికే పలు స్క్రీన్ చాట్ లను రివీల్ చేశాడు. తాజాగా మరో స్క్రీన్ చాట్ బయటపెట్టి బాంబ్ పేల్చాడు. తనకు ఎమ్మెల్సీ కవిత మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయని, కవిత అక్క టీఆర్ఎస్ అనే పేరుతో ఉన్న చాట్‌ను కూడా రిలీజ్ చేశాడు సుఖేష్‌. తాను ఆప్‌ నుంచి డబ్బులను బీఆర్ఎస్‌ ఆఫీస్‌లో డెలివరీ చేసినట్లు వెల్లడించాడు.

తాజాగా సుఖేష్ విడుదల చేసిన లేఖ సారాంశం ఏంటంటే.. కవిత ఫోన్‌ నెంబర్లంటూ స్క్రీన్‌ షాట్లు విడుదల చేశాడు. తీహార్ క్లబ్ కు వస్తున్నారని కవిత, కేజ్రీవాల్ కు స్వాగతం చెప్పాడు. ముందు కేజ్రీవాల్, ఆ తర్వాత నీవంతే అంటూ కవితను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. అతి త్వరలోనే కేజ్రీవాల్‌తో జరిపిన చాట్స్ విడుదల చేస్తానని సుకేష్ తెలిపాడు. అయితే ట్విట్టర్ ద్వారా సమాధానాలు ఇవ్వవద్దని, ఇవన్నీ పాత ట్రిక్కులని ఘాటుగా వ్యాఖ్యానించాడు. తనను దొంగ, అర్ధిక నేరగాడు అంటూ విమర్శించారని, మీరు కూడా అందులో భాగస్వాములే అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. ఈ కేసులో సక్రమంగా విచారణ జరిగేలా సహకరించాలని కవితకు సూచించాడు. కవితను కవితక్క అంటానని, ఆమెను తన పెద్ద అక్కగా పేర్కొన్నాడు. మరో విశేషం ఏంటంటే.. సుఖేష్ చంద్రశేఖర్ రిలీజ్ చేసిన తాజా లేఖలో కవిత ఫోన్ నెంబర్లు ఉన్న స్క్రీన్ షాట్లు బయటపెట్టాడు. కవిత పేరిట సేవ్ చేసుకుని చాట్ చేసిన 2 ఫోన్ నెంబర్లు 6209999999, 8985699999 స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేశాడు. ఇంకో ఛాట్‌లో సత్యేంద్ర జైన్ వ్యక్తిగత ఫోన్ నెంబర్ 9810154102 అని లేఖలో పేర్కొన్నాడు.

Read More: Ananya Nagalla : అందుకేనేమో నన్నెవ్వరూ ట్రై చెయ్యట్లేదు.. అనన్య నాగళ్ళ