Site icon HashtagU Telugu

MLC Kavitha: లండన్ కు బయలుదేరిన కవిత, మహిళల భాగస్వామ్యం పై కీలకోపన్యాసం

Kavitha

Kavitha

MLC Kavitha: పబ్లిక్ పాలసీకి సంబంధించి ప్రముఖ బ్రిడ్జ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  లండన్ కు బయలుదేరి వెళ్లారు. లండన్ లోని సెంట్రల్ హాల్ వెస్ట్ మినిస్టర్ లో “మహిళా రిజర్వేషన్ చట్టం – ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం” అనే అంశంపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశంలో కవిత కీలకోపన్యాసం చేయనున్నారు.

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమ తీరుతెన్నులు, ఈ రిజర్వేషన్ల ద్వారా జరగబోయే మేలు, చట్టసభల్లో ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెంచడం, రాజకీయాల్లో మహిళల పాత్ర వంటి అంశాలపై కవిత ప్రసంగం సాగనుంది. అయితే, అదే రోజు ఉదయం లండన్ లోని అంబేద్కర్ హౌస్ మ్యూజియం ను సందర్శించనున్నారు. ఇక శనివారం రోజున నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ అండ్ అలుమిని యూనియన్ యూకే వారు నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని కవిత మాట్లాడుతారు.