Site icon HashtagU Telugu

Mlc Kavitha: యువతకు ఉద్యోగ నామ సంవత్సరం

Kavitha

Kavitha

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. “శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్ కారాయచ.. సర్వా ర్రిష్ట వినాశాయ..  నింబకం దళ భక్షణమ్‌॥ అంటూ పచ్చడి తాగుతాం. ఉగాది పచ్చడిలో ఉండే తీపి, చేదు, పులుపు, ఒగరు, కారం, ఉప్పు రుచులు ఉన్నట్టుగానే, జీవితంలోనూ కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు, అనేక కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన సందర్భాలు వస్తుంటాయి. అన్ని పరిస్థితుల్లోనూ దేవుడు మీతో ఉండాలని, ప్రజలంతా ధైర్యంగా జీవితంలో ముందడుగు వేయాలని కోరుకుంటున్నా.

తెలుగు వారంతా ఈ సంవత్సరాన్ని శుభకృత్ నామ సంవత్సరంగా జరుపుకుంటే, తెలంగాణ యువత ఉద్యోగ నామ సంవత్సరంగా చేసుకుంటున్నారని భావిస్తున్నాను. సీఎం కేసీఆర్  90 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తుండటంతో, యువత ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నారు. పరీక్షలకు సిద్దమయ్యే యువత టీ- సాట్ ద్వారా టీవిల్లో, యూ ట్యూబ్ లో ఉచితంగా అందుబాటులో ఉండే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మెటీరియల్ ను ఉపయోగించుకుని, ప్రభుత్వ ఉద్యోగాలు  సాధించాలి’’ అని కోరారు.

Exit mobile version