Site icon HashtagU Telugu

MLC Kavitha: పదేళ్ల ‘అంబేద్కర్’ జ్ఞాపకం

Kavitha

Kavitha

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం 2012 లో 48 గంటల దీక్ష చేసిన విషయాన్ని ‌ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ లో పంచుకున్నారు. భారత రాజ్యాంగ రూపకర్త, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన అంబేద్కర్ విగ్రహం చట్ట సభలో ఏర్పాటు చేయాలని హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వేదికగా 2012 ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 15 వరకు కవిత 48 గంటల దీక్ష చేశారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కవిత దీక్షకు మద్దతుగా నిలిచాయి. ఎమ్మెల్సీ కవిత దీక్షకు తలొగ్గిన‌ ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు కోసం 2012 లో 48 గంటల దీక్ష’ అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

Exit mobile version