Site icon HashtagU Telugu

MLC Kavitha: ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్? పోలీసులు బేషరతుగా క్షమాపణ చెప్పాలి

Mlc Kavitha, chandrababu

Mlc Kavitha

MLC Kavitha: శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థినిపై పోలీసుల దాడి అమానుషమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇదే నా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ప్రశ్నించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత “ఎక్స్” లో పోస్ట్ చేశారు. పోలీసులు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని దాడికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలి

హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న అంశంపై ఈ నెల 26న భారత్ జాగృతి ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్ లోని ఖాజా మాన్షన్ లో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి రావాల్సిందిగా ఆయా రాజకీయ పార్టీలను జాగృతి నాయకులు ఆహ్వానించారు. భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి నేతృత్వంలో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ తో పాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులను జాగృతి నేతలు ఆహ్వానాన్ని అందించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, ప్రొఫెసర్లు కూడా పాల్గొననున్నారు.