MLC Kavitha : నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ

ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరగనుంది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను క్వాష్ చేయాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు.

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 09:27 AM IST

ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరగనుంది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను క్వాష్ చేయాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా (Justice Sanjeev Khanna), జస్టిస్ సుందరేశ్ (Justice Sundaresh), జస్టిస్ బేలా త్రివేది (Justice Bela Triveda) లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

అయితే.. రాజకీయ ప్రోద్బలంతోనే తనను ఈడీ అరెస్ట్ చేసిందని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. కొందరు రాజకీయ నాయకులు తనను అరెస్ట్ చేయిస్తామని బహిరంగంగానే ప్రకటించిన విషయాన్ని తన పిటిషన్‌లో పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆధారాలు లేకపోయినా కుట్రలో భాగంగా తనను కేసులో ఇరికించాలని ఈడీ ప్లాన్ చేస్తోందని ఆరోపించారు కవిత. కొందరు నిందితుల స్టేట్‌మెంట్ల ఆధారంగానే కేసులో తన పేరు చేర్చారని, చార్జ్‌షీట్‌లో ఎక్కడా తనను నిందితురాలిగా పేర్కొనలేదనే విషయాన్ని పిటిషన్‌లో పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (CM Aravind Kejriwal)ను మద్యం పాలసీ స్కామ్-లింక్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం సాయంత్రం అరెస్టు చేసింది, బలవంతపు చర్య నుండి ఆప్ చీఫ్‌కు రక్షణ కల్పించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన కొన్ని గంటల తర్వాత. పదవిలో ఉండగానే ఏజెన్సీ అరెస్టు చేసిన మొదటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి ముందు, ED అధికారులు అతని అధికారిక నివాసంలో సోదాలు మరియు రెండు గంటల పాటు విచారించారు. అరెస్టు తర్వాత, తదుపరి విచారణ కోసం కేజ్రీవాల్‌ను దేశ రాజధానిలోని ఏజెన్సీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అంతకుముందు, ఎక్సైజ్ కుంభకోణం కేసులో ఎఎపి చీఫ్ తొమ్మిదో ఇడి సమన్లను దాటవేశారు. అతను ఈ సమన్లను “చట్టవిరుద్ధం” అని పేర్కొన్నాడు.

Read ALso : CM Kejriwal Arrest: సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై రాహుల్ స్టేట్ మెంట్