తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసమర్థతతో రాష్ట్రంలో కృత్రిమ కరవు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయలేదని రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సీఎం రేవంత్ డీఎన్ఏలోనే మోదీతో స్నేహం ఉందని కవిత విమర్శించారు. అంతేకాకుండా.. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలపై సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు కవిత. మహిళా రిజర్వేషన్ల అమలుపై రేపు ధర్నా చౌక వద్ద దీక్ష చేస్తామని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
లిక్కర్ కేసు…పెద్ద కేసు కాదని, నాకు కూడా పెద్ద ఇంటరెస్ట్ లేదని ఆమె అన్నారు. మా లీగల్ టీం దాన్ని చూసుకుంటుందని ఆమె వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో సిద్ధాంతాలకు చోటు లేకుండా పోయిందని కవిత అన్నారు. ఆదర్శ్ స్కామ్ లో ప్రమేయం ఉన్న చవాన్ కు రాజ్యసభ సీటు ఇచ్చారని ఆమె వెల్లడించారు. ఆయన్ను సీఎంగా చేస్తారేమో అని వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ కవిత. సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతతో రాష్ట్రంలో కృత్రిమ కరువు వచ్చిందని ఆమె మండిపడ్డారు. సాగునీరు, తాగునీరు ఇవ్వలేమని సీఎం అంటున్నారని.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఈ కరువు వచ్చిందని, కేసీఆర్ ను బద్నాం చేయాలని కుట్ర చేస్తున్నారని ఆమె అన్నారు. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన అని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. రేవంత్ పాలనలో బీసీ మేజర్ కులాలకు ప్రాధాన్యత లేదని ఆమె విమర్శించారు.
మహిళ వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ సర్కార్‌పై ముద్ర పడబోతోందని ఆమె అన్నారు. పూర్తిగా మహిళా రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందని, మొన్న ఇచ్చిన 30 వేల ఉద్యోగాల్లో ఎంత మంది మహిళలకు వచ్చాయని ఆమె ప్రశ్నించారు. పాత జీవోలు రద్దు చేసి, కొత్త జీవోలు ఇస్తున్నారని కవిత మండిపడ్డారు. దీక్షకు అనుమతులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడెందుకు ఇవ్వటం లేదని ఆమె ధ్వజమెత్తారు. మరో గంట వేచి చూసి కోర్టుకు వెళ్లి రేపటి ధర్నా అనుమతి తెచ్చుకుంటామని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ అనుమతులు ఇవ్వకపోతే కోర్టుకు అనుమతి తెచ్చుకొని బతుకమ్మలు ఆడిన చరిత్ర మాది అని కవిత గుర్తు చేశారు.
Read Also : Prashanth Neel: నన్ను ఫాలో కావద్దు, నేను చేసిన తప్పు మీరు చేయవద్దు…. కెజిఎఫ్ డైరెక్టర్ ఇలా అనేశాడేంటి?