Site icon HashtagU Telugu

MLC Kavitha : నేడు మరోసారి ఈడీ విచార‌ణ‌కు వెళ్ల‌నున్న క‌విత‌

More Evidence For Kavitha's Arrest! Business Partner Pillai's Ed Beds

More Evidence For Kavitha's Arrest! Business Partner Pillai's Ed Beds

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో తెలంగాణ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను ఈడీ అధికారులు ఈ రోజు మ‌రోసారి ప్ర‌శ్నించ‌నున్నారు. నిన్న ప‌దిన్న‌ర గంట‌ల పాటు ఈడీ అధికారులు క‌విత‌ను ప్ర‌శ్నించారు. లిక్క‌ర్ స్కాంలో రూ. 100 కోట్ల ముడుపులు, సౌత్​ గ్రూప్​ పాత్రపై ఆరాతీసినట్లు సమాచారం. సోమవారం ఉదయం 10.20 గంటలకు ఢిల్లీలోని సీఎం కేసీఆర్​ క్యాంప్​ ఆఫీసు నుంచి ఈడీ హెడ్​ క్వార్టర్స్​కు కవిత వెళ్లారు. డాక్యుమెంట్లు, ఈడీ నోటీసులతో 10.30 గంటల తర్వాత ఆమె లోపలికి వెళ్లగా.. తొలుత అక్కడి సిబ్బంది వ్యక్తిగత సమాచారాన్ని రికార్డు చేశారు. ఆ తర్వాత ఐదుగురు సభ్యుల ఈడీ ఆఫీసర్ల టీమ్​ విచారణ మొదలుపెట్టింది. ప‌దిన్న‌ర గంట‌ల పాటు క‌వితను ఈడీ అధికారులు విచారించారు. ఈ రోజు మ‌రోసారి విచార‌ణ‌కు రావాల‌ని క‌విత‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ రోజు 11.30కు క‌విత ఈడీ విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు.