Site icon HashtagU Telugu

MLC Kavitha: తెలంగాణపై ఎందుకీ వివక్ష!

Kavitha

Kavitha

గత కొన్నాళ్లుగా కేంద్రంపై టీఆరెస్ పార్టీ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోందని..ఈ విషయంలో బీజేపీపై పోరాటం చేయాలని అధినేత కేసీఆర్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ తోపాటు..టీఆరెస్ ప్రముఖులు కేంద్రంపై తమదైన శైలిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎమ్మెల్సీ కవిత కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ధాన్యం కొనుగోలుతోపాటు వరద సాయంలోనూ తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర సర్కారు వివక్ష చూపిస్తుందని మండిపడ్డారు.

దేశవ్యాప్తంగా వరదలు సంభవించినప్పుడు మిగతా రాష్ట్రాలకు సాయం అందించిన కేంద్రం తెలంగాణపై వివక్ష చూపించిందన్నారు. 2021-22 ఏడాదికి కేంద్రం ఆయా రాష్ట్రాలకు ప్రకటించిన వరద సాయం రెండు రోజుల కింద విడుదల చేసింది కానీ ఇందులో తెలంగాణ పేరు లేదన్నారు. వరదసాయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు. అందుకు సంబంధించిన వరద సాయం లిస్టును కవిత సోషల్ మీడియాలో పోస్టు చేశారు. హైదరాబాద్ లో వరదలతో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు కానీ వారికి ఎలాంటి సాయం అందించలేదని మండిపడ్డారు. హైదరాబాద్ లో వరదలు సంభవించినప్పుడు టీఆరెస్ ప్రభుత్వం ఆదుకుందని గుర్తుచేశారు. బాధితులకు కేసీఆర్ అండగా నిలిచారన్నారు.

Exit mobile version