Site icon HashtagU Telugu

Congress MLC: బీజేపీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్

MLC Elections

MLC Elections

Congress MLC: ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ సీఎం KCR మైత్రి ఎక్కడ బెడిసికొడుతుందోనని…. ఇన్నిరోజులు కవితను అరెస్టు చేయకుండా ఉన్నారని జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. భారాస అధికారం నుంచి దిగిపోగానే… ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని వ్యాఖ్యానించారు. జగిత్యాల మోదీ ప్రసంగం నిర్మాణాత్మకంగా ఉంటుందనుకుంటే .స్పష్టత లోపించిందన్నారు. మోదీ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ అమ్మకానికి పెట్టారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు.

కాగా తెలంగాణను దోచుకున్నవారిని వదిలిపెట్టేదిలేదని.. ఇది మోదీ గ్యారంటీ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెచ్చరించారు. తనను భరతమాత పూజారిగా అభివర్ణించిన ప్రధాని…. శక్తినాశనం చేస్తామంటున్న వారి నుంచి రక్షించేందుకు అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. జగిత్యాలలో జరిగిన భాజపా బహిరంగసభలో ప్రసంగించిన మోదీ… రాబోయే ఎన్నికల్లో భాజపాకు 400పైగా సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.