BRS MLA: దానం నాగేందర్ వ్యాఖ్యలకు వివేకానంద కౌంటర్

BRS MLA: బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది అని దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలకు పత్రికా ప్రకటన ద్వారా  బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద కౌంటర్ ఇచ్చారు. దానం పరిధులు దాటి మాట్లాడారు, తనలాగే మిగతా ఎమ్మెల్యేలను బద్నాం చేయాలని చూస్తున్నారని, రాజకీయాల్లో దానం చాప్టర్ ఖతం అయినట్లే, ప్రతిపక్షంలో వుండి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. కిషన్ రెడ్డి ని గెలిపించేందుకే రేవంత్ రెడ్డి దానం కు సికింద్రాబాద్ లోకసభ కాంగ్రెస్ టికెట్ ఇచ్చారని అన్నారు. వి […]

Published By: HashtagU Telugu Desk
MLA Vivekananda Sensational comments on Revanth Reddy and Raghunandan Rao

MLA Vivekananda Sensational comments on Revanth Reddy and Raghunandan Rao

BRS MLA: బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది అని దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలకు పత్రికా ప్రకటన ద్వారా  బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద కౌంటర్ ఇచ్చారు. దానం పరిధులు దాటి మాట్లాడారు, తనలాగే మిగతా ఎమ్మెల్యేలను బద్నాం చేయాలని చూస్తున్నారని, రాజకీయాల్లో దానం చాప్టర్ ఖతం అయినట్లే, ప్రతిపక్షంలో వుండి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. కిషన్ రెడ్డి ని గెలిపించేందుకే రేవంత్ రెడ్డి దానం కు సికింద్రాబాద్ లోకసభ కాంగ్రెస్ టికెట్ ఇచ్చారని అన్నారు.

వి .హన్మంత రావు కు టిక్కెట్ ఇచ్చి ఉంటే గెలిచేవారు అని, మంత్రి పదవి పై ఆశ తోనే దానం నాగేందర్ బీ ఆర్ ఎస్ పై అవాకులు చవాకులు పేలుతున్నారని, ఎమ్మెల్యే అంటే అధికారంలో వుండటమే కాదు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేనే అంటారని దానం గ్రహించాలని, రాత్రికి రాత్రి పార్టీలు, కండువాలు మార్చి సంపాదనలో పడ్డ దానం లాగా మేము పార్టీలు మారబో అని  బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద స్పష్టం చేశారు.

  Last Updated: 21 Jun 2024, 11:33 PM IST