YSRCP : విజయవాడ పశ్చిమ నుంచి మళ్లీ పోటీ చేస్తాన‌న్న వెల్లంప‌ల్లి.. తెర‌మీద‌కు మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మీ పేరు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే తాను మళ్లీ పోటీ చేస్తాన‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస్ స్ప‌ష్టం చేశారు.

Published By: HashtagU Telugu Desk
Vellampalli

Vellampalli

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే తాను మళ్లీ పోటీ చేస్తాన‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస్ స్ప‌ష్టం చేశారు. తనకు పార్టీ టిక్కెట్టు నిరాకరించి వేరే నియోజకవర్గానికి మార్చారనే వదంతులపై ఘాటుగా స్పందించారు.తాను, న‌గర మేయర్ రాయణ భాగ్యలక్ష్మితో కలిసి సీఎం వద్దకు వెళ్లినట్లు స్పష్టం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో నగరంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తానని తేల్చిచెప్పిన ఆయన, నియోజకవర్గ మార్పుపై పార్టీ హైకమాండ్ ఇప్పటి వరకు తనతో చర్చించలేదన్నారు. తనను సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయమని అడిగారనడంలో వాస్తవం లేదన్నారు. తాను పార్టీకి రాజీనామా చేశానని ప్రచారం చేయడం అన్యాయమ‌ని.. తాను జగన్ మోహన్ రెడ్డికి వీరాభిమానినని తెలిపారు. ఆయన ఏది అడిగినా చేసేందుకు సిద్ధమని వెల్లంప‌ల్లి శ్రీనివాసరావు అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నగరంలోని మూడు నియోజకవర్గాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించి ముఖ్యమంత్రికి అందజేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం తనదేనని, ఎలాంటి మార్పు ఉండదని మాజీ మంత్రి అన్నారు. సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించే వారికి ఇలాంటి అనవసరమైన గాసిప్స్ ప్రచారం చేయవద్దని సూచించారు. త‌న సీటును మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పశ్చిమ నుంచి, మల్లాది విష్ణు సెంట్రల్ నుంచి, దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆయన తేల్చి చెప్పారు.

Also Read:  Covid New Variant : కోవిడ్ కొత్త వేరియంట్‌ను ఎదుర్కోవ‌డానికి సిద్ద‌మైన విశాఖ జిల్లా అధికార యంత్రాంగం

  Last Updated: 22 Dec 2023, 08:43 AM IST