Site icon HashtagU Telugu

Politics: కేసీఆర్ కుటుంబంపై మరోసారి మాట్లాడితే నరికేస్తాం-ఎమ్మెల్యే షకీల్

Template (69) Copy

Template (69) Copy

నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంఎల్ఏ షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ మల్లన్న వ్యాఖ్యలకు స్పందిస్తూ.. కేసీఆర్ కుటుంబంపై మరోసారి మాట్లాడితే మూడు వందల ముక్కలుగా నరికేస్తాం. ఎక్కువ మాట్లాడితే నేనే ఇంటికి వచ్చి కొడతా… క్రమశిక్షణ గల బీజేపీ తీన్మార్ మల్లన్న కి నేర్పేది ఇదేనా? అని మండిపడ్డారు. అయితే ప్రభుత్వ విధివిధానాలపై ప్రతిపక్షాల నిర్మాణాత్మకమైన విమర్శల వల్ల ప్రజాస్వామ్యాని బలోపేతం చేస్తాయి కానీ వ్యక్తిగత ఆరోపణలు చేయడం వల్ల రాజకీయాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ఇటీవల బీజేపీ పార్టీ సభ్యుడు తీన్మార్ మల్లన్న కెసిఆర్ కుటుంబం పై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు.. ఆ వ్యాఖ్యలకు బదులిస్తూ.. టీఆర్ఎస్ నాయకులు చేసే వ్యాఖ్యలు ఆయా పార్టీల పరిపక్వతకు అద్దం పడుతున్నాయి.

Exit mobile version