Site icon HashtagU Telugu

Flood Affected : ములుగు ప్రజలకు నేనున్నానంటూ సీతక్క భరోసా

MLA Seethakka Visits Flooded Areas To Rescue People

MLA Seethakka Visits Flooded Areas To Rescue People

ములుగు ఎమ్మెల్యే సీతక్క మరోసారి తన గొప్ప మనసు చాటుకుంది. ఏ రాజకీయ నాయకుడైన, నాయకురాలైన గెలిచే వరకే ప్రజల మధ్య ఉంటారు. గెలిచినా తర్వాత వారి దగ్గరికి ప్రజలు పోవాలి. కష్టాల్లో ఉన్నామన్న కొంతమంది పట్టించుకోరు..వరదలు వచ్చిన తగ్గకకాని రారు. పోనీ ఏమైనా సహాయం చేస్తారా అంటే అదీలేదు. ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి అక్కడి నుండి జారుకుంటారు. ఇలా ఎంతోమందిని ఇప్పటివరకు చూసాం..చూస్తూనే ఉన్నాం. కానీ సీతక్క ఆలా కాదు. సాటి మనిషి ఆపదలో ఉన్నారంటే అది పగల..రాత్రా ..ఊరా..అడవి అనేది ఏమిచూడదు. పరుగుపరుగున వెళ్లి వారికీ సాయం చేస్తుంటుంది.

తాజాగా కురిసిన భారీ వర్షాలకు , వరదలకు (Flooded Areas) ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు నేనున్నాను అంటూ నడుం బిగించింది సీతక్క. కొండలు, కోనలు, వాగులు , వంకలు దాటుకుంటూ వారికీ తన చేతనైన సాయం చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. భారీ వర్షాలకు ములుగు నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తినేందుకు తిండిలేక, తాగేందుకు మంచి నీరు లేక, ఉండేందుకు, గూడు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. దీంతో వారి బాగోగులు తెలుసుకునేందుకు సీతక్క (MLA Seethakka) క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. వారికీ ధైర్యం చెబుతూ తనకు తోచిన సాయం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. కారు వెళ్లిలేని ప్రాంతంలోకి కూడా సీతక్క నాటు పడవల్లో , మోకాలి లోతు వరద నీటిలో నడుచుకుంటూ బాధితులను కలిసి నేనున్నాంటూ భరోసా ఇస్తున్నారు. వరద బాధితులకు రూ.20 లక్షల విలువైన నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేసి, ఏ ఎమ్మెల్యే చేయనటువంటి విధంగా సాయం చేసి గ్రేట్ అనిపించుకుంటున్నారు.

నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో సీతక్కకు వరద బాధితులు ధన్యవాదాలు తెలుపుతూ.. ఇంత కష్ట సమయంలో సీతక్క సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుండడం తో ప్రతి ఒక్కరు జయహో..సీతక్క అంటూ కామెంట్స్ వేస్తున్నారు.

Read Also : Revanth Reddy: దొరల రాజ్యం పోయి రైతుల రాజ్యం రావాలి: రేవంత్ రెడ్డి