Site icon HashtagU Telugu

MLA Roja: చంద్రబాబుపై రోజా సెటైర్లు

MLA Roja

MLA Roja

నగరి ఎమ్మెల్యే రోజా ఆదివారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ చంద్రబాబు కుప్పం పర్యటనపై విమర్శలు చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా చంద్రబాబు కుప్పం చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.

14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు కుప్పం ప్రజలకు కనీసం మంచి నీరు కూడా అందించలేదన్నారు. కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన చంద్రబాబుకు వచ్చింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించి.. పబ్బం గడుపుకుంటున్న చంద్రబాబుకు కుప్పం ప్రజలు వాస్తవాలు చూపించారు. చంద్రబాబు కళ్లు బైర్లు కమ్మాయని రోజా అన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లలో మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. గురువారం ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా పేదల సొంతింటి కల సాకారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారన్నారు. ఉనికిని కాపాడుకునేందుకు టీడీపీ నిరసనలకు దిగుతోంది.