Site icon HashtagU Telugu

Kothagudem : వరదల్లో ప్రజలు..డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ లీడర్స్

Mla Rega Kantha Rao Posts

Mla Rega Kantha Rao Posts

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు (Floods in Telangana) ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజల అవసరాలు తీర్చాల్సిన రాజకీయ నేతలు ప్రజలను పట్టించుకోకుండా డాన్సులు (Dance) వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబదించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ( Telangana) దాదాపు వారం రోజుల పాటు ఆకాశానికి ఏమైనా చిల్లు పడిందా అనే విధంగా భారీ వర్షాలు (Heavy Rains ) కురిసిన సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు , వంకలు , చెరువులు , నదులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో పలు పట్టణాలతో పాటు గ్రామాలు నీటమునిగాయి. రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడం తో..వరద ఉదృతి తగ్గింది. దీంతో ప్రజలు బయటకు వస్తున్నారు. ముఖ్యంగా గోదావరి ముంపు గ్రామాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి.

వర్షాలు , వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే పలు రాజకీయ పార్టీలు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకుంటూ స్వలాభం చూసుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ (Congress Vs BRS) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వరదలఫై సమీక్షలు జరపకుండా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని కాంగ్రెస్ నేతలు అంటుంటే.. వర్షాలు పడుతున్న పది రోజుల పాటు కాంగ్రెస్ నేతలు ఇంట్లో పడుకొని , తీరిగ్గా వర్షాలు తగ్గినా తర్వాత రోడ్లపైకి వచ్చి ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తున్నారని బిఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఈ వార్ ఇలా కొనసాగుతుండగా..పినపాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు (MLA Rega Kantha Rao)..కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్న డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియా లో షేర్ చేసి విమర్శలు చేసారు.

‘భద్రాద్రి @ వరదముంపుతో బాధల్లో ప్రజలు ఉంటే … సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం BRS పార్టీ ఎమ్మెల్యే లు ఎంపీలు ఎమ్మెల్సీ లు పార్టీ శ్రేణులు ఉన్నారు. భట్టి విహారయాత్రతో విందు చిందుల్లో కాంగ్రెస్ నాయకులు ఇవిగో సాక్షాలు స్థానిక నాయకులతో కలిసి DCC అధ్యక్షుడు డాన్స్ లు… ఇది వీరి పరిస్థితి ప్రజలపట్ల ప్రజా సమస్యల పట్ల వీరికి ఉన్న చిత్తశుద్ధి ప్రజలు గమనించాలని కోరుచున్నాను… రేగా ‘ అని పోస్ట్ చేసారు.

రేగా కాంతారావు పోస్ట్ కు ఎమ్మెల్యే వీరయ్య (MLA Podem Veeraiah) కౌంటర్ ఇచ్చారు. ప్రజల వరద కష్టాలు తీర్చలేకనే బీఆర్ఎస్ ఇలా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అన్న వీరయ్య.. రేగా కాంతారావు విజ్ఞతకే వదిలేస్తున్నా అని పోస్ట్ చేసారు. ప్రస్తుతం కాంతారావు పోస్ట్ చేసిన డాన్స్ వీడియో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

https://www.facebook.com/100004252988012/videos/295352783145815/

Read Also : Medha Patkar : కర్షక కార్మిక రాష్ట్ర సదస్సు.. రాజధాని ఏది? అమరావతి నిర్మాణంపై మేధా పాట్కర్..