Site icon HashtagU Telugu

BRS : హరీష్ రావు దుకాణం బంద్ చేయించే వరకు నేను నిద్రపోను – మైనంపల్లి హనుమంతరావు

Mynampally Hanumantha Rao sensational comments on minister harish rao

Mynampally Hanumantha Rao sensational comments on minister harish rao

ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (MLA Mynampally Hanumanth Rao)..మరోసారి వార్తల్లో నిలిచారు. నిత్యం ఏదొక వివాదాస్పద విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచే ఈయన..తాజాగా సొంత పార్టీ మంత్రి ఫై అదికూడా కేసీఆర్ కుటుంబ సభ్యుడైన హరీష్ రావు ఫై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఇప్పటివరకు ఎవ్వరు కూడా అనరాని మాటలను మైనంపల్లి హనుమంతరావు..హరీష్ రావు (Harish Rao) ను అన్నారు.

తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మెదక్‌లో ప్రచారం చేయడానికి హరీశ్ రావు ఎవరని ప్రశ్నించారు. తన నియోజకవర్గంని వదిలి మా జిల్లాలో పెత్తనం చేస్తున్నాడని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మల్కాజ్‌గిరి (Malkajgiri) నుంచి తాను, మెదక్ నుంచి తన కుమారుడు రోహిత్ (Mynampally Hanumantha Rao son Rohit) పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అవసరమైతే సిద్దిపేటలో తన తడాఖా చూపిస్తా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని, హరీష్ రావు బట్టలు ఊడతీసే వరకు నిద్రపోనని , హరీష్ రావు అక్రమంగా రూ. లక్ష కోట్లు సంపాదించాడని మైనంపల్లి ఆరోపించారు. రాజకీయంగా ఎంతో మందిని అణిచివేశాడన్నారు. మెదక్‌లో తన తనయుడు.. మల్కాజ్‌గిరిలో తాను పోటీ చేస్తామని మైనంపల్లి స్పష్టం చేసారు. తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని.. తనకు పార్టీ ఇప్పటికే టికెట్ ప్రకటించిందని , మెదక్‌లో తన తనయుడుని కచ్చితంగా గెలిపించుకుంటానన్నారు. అయితే తన కుటుంబంలో ఇద్దరికీ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తానని మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు.

“హరీశ్ రావుకు పెద్ద ఎత్తున బుద్ధి చెబుతాం. రబ్బరు చెప్పులతో ఎలా వెలమ హస్టల్‌కు వచ్చాడో అందరికీ తెలుసు. ఈసారి ఏ స్థాయిలో హరీశ్ రావు ఉన్నాడో అందరూ గమనించాలి. నూటికి నూరుపాళ్లు హరీశ్‌ రావుకు బుద్ధి చెబుతాను. ఈసాయి అయితే నాకు టైమ్ లేదు. మెదక్, మల్కాజ్‌గిరిపై దృష్టిపెడతాను. తరువాత సిద్దిపేటలో హరీశ్ రావు అడ్రస్ గల్లంతు చేస్తా. దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నేను మాట ఇస్తే మాట తప్పను. హరీశ్ రావును గద్దె దించేవరకు.. దుకాణం బంద్ చేయించే వరకు నేను నిద్రపోను..” అంటూ మైనంపల్లి సంచలన కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం మైనంపల్లి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ మొదటి విడుత అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో మైనంపల్లి ఇలాంటి కామెంట్స్ చేయడం..అదికూడా పార్టీ లో కీలక నేతపై చేయడం ఏంటి అని అంత మాట్లాడుకుంటున్నారు. మరి దీనిపై హరీష్ రావు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మైనంపల్లి హన్మంతరావు రాజకీయాల విషయానికి వస్తే.. 1998లో టీడీపీ పార్టీ తో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2008 జరిగిన ఉప ఎన్నికలలో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. రెండోసారి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శశిధర్ రెడ్డిపై 21151 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన మెదక్ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా పని చేశాడు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హన్మంతరావు మల్కాజ్‌గిరి నియోజకవర్గం టీడీపీ టికెట్ ఆశించాడు, 2014లో ఎన్నికల్లో తెలుగు దేశం, బీజేపీ పొత్తుతో భాగంగా ఆయనకు టికెట్ దక్కకపోవడంతో 2014 ఏప్రిల్ 6న మైనంపల్లి హన్మంతరావు టీడీపీకి రాజీనామా చేశాడు. ఏప్రిల్ 08 న 2014న కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ అదే రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో అదే రోజు సాయంత్రం టిఆర్ఎస్ లో చేరారు.

2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి సి.హెచ్. మల్లారెడ్డి పై 28371 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. ఆయన 21 ఏప్రిల్ 2015లో తెలంగాణ రాష్ట్ర సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 2017లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్. రామచందర్ రావు పై 73698 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఎమ్మెల్యేగా గెలవడంతో 12 డిసెంబర్ 2018న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు.

Read Also : TDP : నారా లోకేష్ ..టీడీపీ నేతలను పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచినట్లేనా..?