Site icon HashtagU Telugu

Kodali Nani : చంద్ర‌బాబుపై కొడాలి ఫైర్‌.. అక్కడ గెల‌వ‌నోళ్లు.. గుడివాడ‌లో గెలుస్తారా..?

kodali nani

kodali nani

స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు టీడీపీ సొత్తు కాద‌ని మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. ఆయన జాతి సంపద అని, ఎన్టీఆర్ ఫొటోను ఎవరైనా వాడుకోవచ్చని అన్నారు. ఎన్టీఆర్ ఫొటో రంగులకు.. టీడీపీకి సంబంధం ఏంటి అని కొడాలి నాని ప్రశ్నించారు. ఆనాడు ఎన్టీఆర్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారని.. ఆ లెటర్ కూడా త‌న దగ్గర ఉందన్నారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు కూడా సిద్ధమ‌ని టీడీపీ నేత‌ల‌కు ఆయ‌న స‌వాల్ విసిరారు. బొమ్మలూరులో త‌న సొంత డబ్బుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని తానే ఏర్పాటు చేశాన‌ని.. త‌న శిలా ఫలకాన్ని తొలగించడంతోనే వివాదం మొదలైందని తెలిపారు. గుడివాడ నియోజకవర్గం మొత్తం ఎన్టీఆర్, వైఎస్సార్ విగ్రహాలను ఏర్పాటు చేసి వైసీపీ రంగులు వేయిస్తానని.. ఎవరేం చేస్తారో చూస్తానని ఆయ‌న హెచ్చ‌రించారు. . సొంత నియోజకవర్గం చంద్రగిరిలో టీడీపీని గెలిపించలేని చంద్రబాబు.. గుడివాడలో ఏం గెలిపిస్తారని ఆయ‌న ప్ర‌శ్నించారు.

Exit mobile version