Site icon HashtagU Telugu

Balakrishna: హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి!

Balakrishna

Balakrishna

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దీక్షకు దిగారు. ఈ మేరకు బాలకృష్ణ స్థానిక నియోజకవర్గంలో మౌనదీక్ష చేపట్టారు. తొలుత పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలి నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున తెదేపా శ్రేణులు పాల్గొన్నాయి. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేడ్కర్‌ కూడలిలో బాలకృష్ణ మౌనదీక్షకు కూర్చున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నేతలు డిమాండ్‌ చేశారు.