Mizoram Bridge Collapse: మిజోరం ప్రమాద బాధితులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మోడీ

మిజోరంలో బ్రిడ్జి ప్రమాదంలో విషాదం నెలకొంది. మిజోరంలోని సాయిరాంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోయింది.

Published By: HashtagU Telugu Desk
Mizoram Bridge

New Web Story Copy (80)

Mizoram Bridge Collapse: మిజోరంలో బ్రిడ్జి ప్రమాదంలో విషాదం నెలకొంది. మిజోరంలోని సాయిరాంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోయింది. ఈ రోజు బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 17 మంది కార్మికులు మరణించారు. రైల్వే, పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 17 మృతదేహాలు లభ్యమయ్యాయి. బుధవారం ఉదయం ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది కార్మికులు ఉన్నారు. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందని వెల్లడించారు.

రైల్వే బ్రిడ్జి కూలిన ఘటనలో మరణించిన వారి బంధువులకు ప్రధానమంత్రి సహాయ నిధి నుండి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 అందజేస్తామని అన్నారు. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రెస్క్యూ ఆపరేషన్‌లు జరుగుతున్నాయి అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసారు. ఈ ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు.

Also Read: ISRO Next Mission : చంద్రుడిపై పరిశోధనా స్థావరం నిర్మాణం.. ఇస్రో, జాక్సా ప్లాన్!

  Last Updated: 23 Aug 2023, 03:20 PM IST