Site icon HashtagU Telugu

Miyapur: మియాపూర్ గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్!

Gang Rape

Gang Rape

Miyapur: హైదరాబాద్ మియాపూర్ లో గ్యాంగ్ రేప్ జరిగినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అమ్మాయి రేప్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ పాత్ర ఉందంటూ వార్తలు వినిపించాయి. అయితే సదరు కంపెనీ ఈ ఘటనపై రియాక్ట్ అయ్యింది. ‘‘మియాపూర్ లో యువతి పై ఇద్దరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ లు అత్యాచార యత్నo చేసినట్లుగా సమాచారం వచ్చింది, వాళ్ళు మా సంస్థకు చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ లు అంటూ ప్రచారం జరుగుతోంది. మా సంస్థ ఎక్కడ కూడా సొంతంగా సేల్స్ విభాగంలో ఉద్యోగులను చేర్చుకోవడం ఉండదు.. వెంచర్ లలో స్థలాలు, ఇళ్ల విక్రయాలకు సంబంధించి బయటి సేల్స్ ఏజెన్సీ సంస్థలతో మాత్రమే ఒక అవగాహన ఏర్పరుచుకుంటుంది. కేవలం.. ప్రాంతాల వారీగా వెంచర్లకు దగ్గర్లో మా సంస్థ కార్యాలయాలు సౌకర్యార్థం మాత్రమే ఏర్పాటు చేస్తుంది’’ JSR Group Sun City అంటూ క్లారిటీ ఇచ్చింది.

‘‘సదరు కార్యాలయాల్లో మాతో సేల్స్ అవగాహన ఏర్పరుచుకున్న ఏజెన్సీ సంస్థలకు చెందిన ప్రతినిధులు వెంచర్ స్థలాలు లేదా ఇళ్లకు సంబంధించిన కార్యకలాపాల మార్కెటింగ్ అవసరాల కోసం మాత్రమే ఉపయోగిస్తారు. అంటే ఇది కేవలం సేల్స్ సంస్థల కోసం సౌకర్యాలతో కూడిన కార్యాలయం ను అందుబాటులో ఉంచడం మాత్రమే అని స్పష్టం చేస్తున్నాం. బాధితురాలికి అత్యాచార యత్నానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు కేవలం సేల్స్ సంస్థలకు చెందిన ఏజెంట్లు మాత్రమే! ఒక్క మా సంస్థకే కాదు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఇతర సంస్థలకు కూడా సేల్స్ అవగాహన సంస్థలలో ఏజెంట్లు గా కూడా వాళ్ళు పనిచేస్తూ ఉండవచ్చు. మా సంస్థతో నేరుగా వారికి ఎటువంటి సంబంధం ఉండదు. మా వెంచర్ కు సంబంధించిన విక్రయాలు చేసినట్లయితే మాతో అవగాహన ఉన్న సేల్స్ ఏజెన్సీ సంస్థ నుండే వారికి కమీషన్ అందుతుంది. కాబట్టి నిందితులు ఇద్దరు మా సంస్థ ఉద్యోగులు అంటూ జరుగుతున్న ప్రచారం తప్పుగా ప్రచారమైనదని దయచేసి గ్రహించగలరు’’ అంటూ క్లారిటీ ఇచ్చింది.