Site icon HashtagU Telugu

Titanic-Missing Submersible : టైటానిక్ ను చూసేందుకు వెళ్లి జలాంతర్గామి గల్లంతు.. అందులో ఐదుగురు టూరిస్టులు

Titanic Missing Submersible

Titanic Missing Submersible

Titanic-Missing Submersible : వందేళ్ల కిందటి మాట.. 

1500 మందికిపైగా టూరిస్టులతో టైటానిక్ ఓడ.. 

1912 సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ.. 

ఆ రోజున  టైటానిక్ ఓడ ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో 12,500 అడుగుల లోతులో మునిగిపోయింది. 

ఆగ్నేయ కెనడా తీరంలోని టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు ఇటీవల వెళ్లిన జలాంతర్గామి ఆచూకీ కూడా ఆదివారం(జూన్ 18) ఉదయం గల్లతైంది. 

1912లో టైటానిక్‌ షిప్‌ ఫస్ట్‌ క్లాస్‌ టికెట్‌  ధర మూడువేల రూపాయలు. ఇప్పుడు శిధిలావస్థలో సముద్రపు అడుగుభాగంలో ఉన్న అదే షిప్‌ను చూసేందుకు వెళ్లే టికెట్‌ ఖరీదు అక్షరాలా కోటి 87లక్షల రూపాయలు. ఈ టూర్ ను ఓషన్‌గేట్‌ ఎక్స్‌పెడిషన్‌ అనే సంస్థ నిర్వహిస్తోంది.  ఏటా వేసవిలో మే నుంచి జూన్‌ వరకు టైటానిక్‌ షిప్‌ ను చూసేందుకు టూరిస్టులను జలాంతర్గామిలో సముద్రపు అడుగుకు తీసుకుపోతోంది. ఇప్పటిదాకా ఇలా వెళ్లి  220 మంది మాత్రమే చూసొచ్చారు. 

Also read : Fly 6000 Kmph : అరగంటలోనే కాశ్మీర్ టు కన్యాకుమారి.. 2035 నాటికి హైపర్‌సోనిక్ విమానం

ఈక్రమంలోనే తాజాగా టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు వెళ్లిన జలాంతర్గామి(Titanic-Missing Submersible) అదృశ్యమైంది. ఆదివారం ఉదయం ఉపరితల నౌక  MV పోలార్ ప్రిన్స్ తో దాని సంబంధాలు తెగిపోయాయి. గల్లంతైన ఆ సబ్మెర్సిబుల్ వెసెల్ లో ఐదుగురు ఉన్నారని అమెరికా, కెనడా దేశాల కోస్ట్‌గార్డ్‌ విభాగాలు తెలిపాయి. వెంటనే ఉత్తర అట్లాంటిక్‌ సముద్రంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టామని తెలిపింది. టైటానిక్ శిథిలాలు ఉన్న ప్రదేశానికి డైవ్ చేస్తున్న సమయంలో..  సబ్‌మెర్సిబుల్ అదృశ్యమైందని అంటున్నారు. సముద్రంలోని  సుమారు 13,000 అడుగుల లోతులో సబ్మెర్సిబుల్ అదృశ్యమైందని చెప్పారు. 70 నుంచి 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ సబ్మెర్సిబుల్ లో ఉందని.. అది సోమవారం మధ్యాహ్నమే పూర్తయిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Also read : Aliens: ఏంటి.. అట్లాంటిక్ మహాసముద్రంలో ఎలియన్స్ ఉన్నాయా.. ఆ కన్నాలే ప్రూఫా?

ఉత్తర అట్లాంటిక్‌ సముద్రంలో గల్లంతైన జలాంతర్గామిలో 59 ఏళ్ల బ్రిటీష్ బిలియనీర్ హమీష్ హార్డింగ్ కూడా ఉన్నారు. ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో నేచురల్ సైన్సెస్, కెమికల్ ఇంజినీరింగ్ చదివారు. హమీష్ హార్డింగ్ కు ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్స్ లైసెన్స్ కూడా ఉంది. బ్లూ ఆరిజిన్ ఫ్లైట్‌లో స్పేస్ టూరిస్ట్‌గా కూడా ఆయన వెళ్లొచ్చారు. ఉత్తర, దక్షిణ ధృవాల ద్వారా భూమిని చుట్టి వచ్చినందుకు హార్డింగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించారు. ప్రస్తుతం దుబాయ్‌కి చెందిన యాక్షన్ ఏవియేషన్ ఛైర్మన్‌గా హార్డింగ్ పనిచేస్తున్నారు.  టైటానిక్ శిధిలాలను అన్వేషించే బృందంలో చేరాలని భావిస్తున్నానని  గత ఏడాది జూన్‌లో  హమీష్ హార్డింగ్ చెప్పారు. ఇందులో భాగంగానే టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు జలాంతర్గామిలో ఆయన వెళ్లారు.