Hyderabad: బావిలో బాలుడి మృతిదేహం లభ్యం

నార్సింగిలో అదృశ్యమైన బాలుడు బుధవారం పాడుబడిన బావిలో శవమై తేలాడు. మంగళవారం 6 ఏళ్ళ బండి ఎదో కొనుక్కునేందుకు కిరాణా దుకాణానికి వెళ్ళాడు.

Published By: HashtagU Telugu Desk
Hyderabad

New Web Story Copy (5)

Hyderabad: నార్సింగిలో అదృశ్యమైన బాలుడు బుధవారం పాడుబడిన బావిలో శవమై తేలాడు. మంగళవారం 6 ఏళ్ళ బండి ఎదో కొనుక్కునేందుకు కిరాణా దుకాణానికి వెళ్ళాడు. అయితే ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో ఖంగారు పడ్డ తల్లిదండ్రులు నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించారు. ఈ రోజు బుధవారం ఓ పాడుబడ్డ బావిలో మృతదేహాన్ని గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది బృందం మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు పలు కోణంలో విచారిస్తున్నారు. బాలుడు ప్రమాదవశాత్తూ బావిలో పడ్డాడా లేక ఏదైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బావికి రక్షణ గోడలు లేకపోవడంతో ప్రమాదవశాత్తు బాలుడు అందులో పడి ఉంటాడని భావిస్తున్నారు. కాగా బాలుడి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు రోదిస్తున్నారు.

Also Read: ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్ టికెట్లు కావాలా.. అయితే ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి..!

  Last Updated: 16 Aug 2023, 02:42 PM IST