హైదరాబాద్(Hyderabad)లో అట్టహాసంగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 (Miss World 2025)పోటీలు ఇప్పుడు మరింత ఉత్కంఠభరిత దశకు చేరుకున్నాయి. మొత్తం 109 దేశాల నుండి వచ్చిన అందగత్తెల మధ్య పోటీలు తీవ్రంగా కొనసాగుతుండగా, తాజా సమాచారం ప్రకారం క్వార్టర్ ఫైనల్స్ కు 48 మంది అందగత్తెలు ఎంపికయ్యారు. ఈ పోటీల్లో పాల్గొన్న అందాల భామలు తమ సాంస్కృతిక ప్రతిభతో పాటు, సామాజిక అవగాహన, మేధస్సుతో కూడా ఆకట్టుకుంటున్నారు.
Corona : భారత్ ను వెంటాడుతున్న కరోనా భయం..కొత్తగా 257 కేసులు
ఇంకా నేపాల్, హైతీ, ఇండోనేషియా దేశాల నుండి వచ్చిన సుందరీల ప్రదర్శనలు మిగిలివుండగా, అవి పూర్తయిన తర్వాత తుది ఎంపిక జరుగనుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ పోటీకి హైదరాబాద్ ప్రత్యేక ఆతిథ్యమివ్వడం గర్వకారణం. టూరిజం మరియు ఫ్యాషన్ రంగాల్లో హైదరాబాద్ గ్లోబల్ కేంద్రంగా మారుతున్న దిశగా ఈ కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్తోంది.
ఈ రోజు మరియు రేపు హైదరాబాద్‌లోని టీ-హబ్ వేదికగా కాంటినెంటల్ ఫినాలే (ఖండాల వారీగా ఫైనల్ ఎంపికలు) జరగనున్నాయి. ఇందులో ఐదు ఖండాలకు చెందిన పోటీదారుల్లో ఉత్తములు ఎంపికవుతారు. వీరు తుది రౌండ్స్‌కు అర్హత పొందతారు. ప్రపంచవ్యాప్తంగా అందానికి, నైపుణ్యానికి గుర్తింపు ఇచ్చే ఈ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో అన్న ఆసక్తి పెరిగిపోతోంది.