Site icon HashtagU Telugu

Miracle in the Sky: ఈ రోజు రాత్రికి ఆకాశంలో అద్భుతం..

Miracle In The Sky Tonight..

Miracle In The Sky Tonight..

Miracle in the Sky : ఆకాశంలో అరుదైన, అద్భుతమైన (Miracle) దృశ్యం మరోసారి ఆవిష్కృతం కానుంది. ఈ రోజు (మార్చ్ 28) రాత్రికి నింగి వైపు తప్పకుండా ఒక్కసారి చూడండి. వీలుంటే మంచి పవర్ ఫుల్ బైనాక్యులర్ రెడీగా ఉంచుకోండి. ఐదు గ్రహాలు (5 Planets) ఈ రోజు దర్శనం ఇవ్వనున్నాయి. గురుడు, బుధుడు, శుక్రుడు, యురేనస్, అంగారకుడు సమీపానికి రానున్నారు. వీటికి చంద్రుడు అదనంగా కనిపిస్తాడు.

‘‘సూర్యాస్తమం తర్వాత పశ్చిమం వైపు చూడాలి. 50 డిగ్రీల పరిధిలో ఈ ఐదు గ్రహాలు కనిపిస్తాయి. ఇందులో గురుడు, శుక్రుడు, అంగారకుడిని మన కళ్లతోనే చూడొచ్చు. బుధగ్రహం, యురేనస్ ను మాత్రం బైనాక్యులర్ ద్వారానే చూడగలరు’’ అని నాసాకు చెందిన బిల్ కూక్ సూచించారు. జూన్ 2022 లోనూ ఇలాంటి అద్భతమే ఒకటి కనిపించింది. నాడు బుధగ్రహం, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని ఒకే లేఖనంపైకి వచ్చారు. అమెరికా మాజీ ఖళోగ శాస్త్రవేత్త, చంద్రుడి పై నడిచిన తొలి వ్యొమగామి అయిన డాక్టర్ బజ్ ఆల్డ్రిన్ కూడా ఈ రోజు (మార్చ్ 28) రాత్రి ఆకాశం వైపు చూడాలని సూచించారు.

Also Read:  Surya Namaskar by the Leopard: సూర్య నమస్కారాలు చేసే చిరుతను చూసారా..!